క్రౌడ్ ఫండింగ్ పెట్టుబడి మోసం

కొత్త రకం మోసం: "ఒక స్టార్టప్‌కు మద్దతు" మరియు "సామాజిక కారణానికి మద్దతు" ఒక మోసానికి దారి తీసినప్పుడు

పెరుగుతున్న నకిలీ క్రౌడ్‌ఫండింగ్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల ప్రమాదం

కొత్త రకం మోసం: "ఒక స్టార్టప్‌కు మద్దతు" మరియు "సామాజిక కారణానికి మద్దతు" ఒక మోసానికి దారి తీసినప్పుడు

పెరుగుతున్న నకిలీ క్రౌడ్‌ఫండింగ్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌ల ప్రమాదం

సాధారణంగా ఇది ఒక భావోద్వేగపూరిత అభ్యర్ధన లేదా అద్భుతమైన ఆలోచనతో ప్రారంభమవుతుంది.

ఒక నవ తరం స్టార్టప్ తమది ‌“భారతదేశపు తదుపరి యునికార్న్‌" అని ప్రకటించుకుంటుంది
ఒక సామాజిక సంస్థ ‌“ప్రతి విరాళంతో, తాము జీవితాలను మారుస్తున్నాము" అని పేర్కొంటుంది
ఒక ఆకర్షణీయమైన క్రౌడ్‌ఫండింగ్ పేజీ ‌చిన్న పెట్టుబడిదారుల కోసం ఈక్విటీ‌‌ మరియు ‌“ఫండింగ్ మూసివేసిన తర్వాత 10x రిటర్న్స్” అని వాగ్దానం చేస్తుంది

లోగో, టెస్టిమోనియల్స్, వ్యవస్థాపకుల ఫోటోలు సహా ప్రతి అంశం నిజం అని అనిపిస్తుంది.
మీరు ఒక ఆవిష్కరణ లేదా ప్రభావానికి మద్దతు ఇస్తున్నారు అని భావించి ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి చేస్తారు.

కొన్ని వారాల తర్వాత వెబ్‌సైట్ మాయమైపోతుంది, ఫోన్ నంబర్లు పని చేయవు - అలాగే మీ ఆశ కూడా అడియాస అవుతుంది.

ఒక నకిలీ క్రౌడ్‌ఫండింగ్ పెట్టుబడి ప్లాట్‌ఫామ్ ద్వారా మీరు మోసగించబడ్డారు.

క్రౌడ్‌ఫండింగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ అంటే ఏమిటి?

బిజినెస్ వెంచర్లు, స్టార్టప్‌లు, లేదా సామాజిక కారణాల కోసం ఆన్‌లైన్‌లో డబ్బును సేకరించడానికి క్రౌడ్‌ఫండింగ్ వీలు కలిపిస్తుంది. నిజమైన క్రౌడ్‌ఫండింగ్ ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ, పెట్టుబడిదారులను మరియు దాతలను దోపిడీ చేయడానికి మోసగాళ్ళు దీనిని దుర్వినియోగం చేస్తారు.

మోసగాళ్ల పనితీరు ఈ విధంగా ఉంటుంది:

  • సేవా కార్యక్రమాల కోసం స్టార్టప్‌లుగా పేర్కొంటూ, వారు నకిలీ వెబ్‌సైట్లు లేదా సోషల్ మీడియా పేజీలను సృష్టిస్తారు.

  • వారు గరిష్ట ఈక్విటీ రాబడులు, ఐపిఒలకు ముందస్తు యాక్సెస్ లేదా లాభంలో భాగస్వామ్యం అని హామీ ఇస్తారు.

  • వారు వేల మంది వ్యక్తుల నుండి చిన్న మొత్తంలో డబ్బు సేకరిస్తారు - విడిగా చూస్తే ఇది పట్టించుకోదగిన మొత్తం కాదు, కానీ అంతా కలిపి చూస్తే ఇది చాలా పెద్ద మొత్తం అవుతుంది.

  • తగినంత డబ్బు సేకరించబడిన తర్వాత అవి అదృశ్యమవుతాయి.

విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ మోసగాళ్ళు సాధారణంగా స్టార్టప్ ఉత్సాహానికి సామాజిక కారణాలను జోడించి భావోద్వేగపూరిత మరియు అత్యావశ్యకత పరిస్థితులను కలిపిస్తారు.

ఆందోళన కలిగించే ధోరణి

సైబర్ క్రైమ్ రిపోర్టుల ప్రకారం, సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూపులు మరియు వాట్సాప్ ఛానెళ్ల పై నకిలీ క్రౌడ్‌ఫండింగ్ సోషల్ ప్రచారాలకు వందల మంది భారతీయులు డబ్బును కోల్పోయారు.

https://www.indiatvnews.com/uttar-pradesh/crowdfunding-scam-up-ats-arrests-three-from-maharashtra-for-misusing-gaza-relief-funds-latest-updates-2025-09-22-1009405

ఎక్కువగా జరగకపోయినప్పటికీ, అనేక ఈక్విటీ ఆధారిత స్టార్టప్ స్కామ్‌లు కూడా అప్పుడప్పుడు జరుగుతున్నాయి. సాధారణ బాధితులు? "మంచి ఆలోచనకు సహాయం చేయడంలో ఏం హాని ఉంది?" అని భావిస్తూ - ₹5,000 - ₹50,000 సహకారం అందించే చిన్న రిటైల్ పెట్టుబడిదారులు

ఈ స్కామ్‌లు మిమ్మల్ని ఎలా ఆకట్టుకుంటాయి

  • భావోద్వేగ పూరిత కథనం: "మహిళల నేతృత్వంలో సుస్థిరత కోసం పోరాడుతున్న స్టార్టప్ మాది."

  • నకిలీ "పెట్టుబడిదారు అప్‌డేట్లను" చూపుతూ ప్రొఫెషనల్‌గా కనిపించే వెబ్‌సైట్లు మరియు డ్యాష్‌బోర్డులు

  • "ఇఎస్‌జి", "ప్రభావవంతమైన పెట్టుబడులు, "ప్రీ-సీడ్ రౌండ్", "ఏంజెల్ భాగస్వామ్యం", మొదలైన ప్రముఖ పదాల వినియోగం.

  • ప్రీ-ఐపిఒ లేదా ప్రారంభ-దశ ఈక్విటీకి "ప్రత్యేకమైన యాక్సెస్" అని పేర్కొనే సందేశాలు.

  • రిజిస్టర్ చేయబడిన వ్యాపార సంస్థలకు బదులుగా వ్యక్తిగత అకౌంట్లు లేదా వాలెట్లలోకి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడానికి అభ్యర్థనలు.

క్రౌడ్‌ఫుండింగ్ స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

  1. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) వెబ్‌సైట్‌లో కంపెనీ రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయండి.

  2. డబ్బు సేకరించబడుతున్న సామాజిక కారణాల ప్రామాణికతను తనిఖీ చేయండి. ఇది మనీ లాండరింగ్‌ కూడా కావచ్చు.

  3. చిన్న మొత్తాల "ఈక్విటీ" వాగ్దానాల పట్ల జాగ్రత్తగా ఉండండి - అసలైన ఈక్విటీ పెట్టుబడి ఎల్లప్పుడూ లైసెన్స్ పొందిన ప్లాట్‌ఫామ్‌లు లేదా అధీకృత బ్రోకర్ల ద్వారా చేయబడుతుంది.

  4. హామీ ఇవ్వబడిన రాబడులను అందించే ప్రచారాల జోలికి వెళ్ళకండి - అసలైన స్టార్టప్‌లు అలా చేయవు.

  5. ఒక వ్యాపారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే వ్యక్తుల యుపిఐ ఐడిలకు లేదా వ్యక్తిగత అకౌంట్లకు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు.

  6. పారదర్శకత కోసం చూడండి - అసలైన స్టార్టప్‌లు ధృవీకరించదగిన సంప్రదింపు వివరాలు, వ్యవస్థాపకుల లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మరియు ఆడిట్ చేయబడిన డాక్యుమెంట్ల వివరాలను పంచుకుంటాయి.

  7. అనుమానాస్పద ప్లాట్‌ఫామ్‌లు లేదా అభ్యర్థనల గురించి సెబీ లేదా cybercrime.gov.inకు నివేదించండి.

తుది మాట: సానుభూతి మంచిదే. ధృవీకరణ ఇంకా మంచిది.

ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడం అద్భుతమైన విషయం — కానీ అది మీ భద్రతకు హాని కలిగించకూడదు.
మోసగాళ్ళు అత్యాశ మరియు మోసానికి సద్భావం మరియు సామాజిక పురోగతి అనే ముసుగును తగిలిస్తున్నారు.

ఒక ఆత్మనిర్భర్ ఇన్వెస్టర్‌గా ఉండండి - మీరు ఒక అపరిచిత ప్లాట్‌ఫామ్‌ పై తదుపరి "పెద్ద ఆలోచన"లో పెట్టుబడి పెట్టడానికి ముందు ఒక క్షణం ఆగండి ఆలోచించండి మరియు ధృవీకరించుకోండి.

ఎందుకంటే అసలైన స్టార్టప్ నమ్మకాన్ని పెంచుతుంది - కుతంత్రాలను కాదు.