- ప్రధాన విషయానికి వెళ్ళండి
- స్క్రీన్ రీడర్ యాక్సెస్
- బీటా వెర్షన్
సంపద సృష్టికి మీ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం డబ్బు కాదు - సమయం
పెట్టుబడి ప్రణాళికలో పెట్టుబడి సమయం పాత్ర గురించి వివరణ
అనేక మంది వేసే ప్రశ్న,"నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?"
కానీ తెలివైన ప్రశ్న -
"నేను ఎంత కాలం పెట్టుబడి పెట్టాలి?"
సంపద సృష్టికి మీ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం డబ్బు కాదు - సమయం
పెట్టుబడి ప్రణాళికలో పెట్టుబడి సమయం పాత్ర గురించి వివరణ
అనేక మంది వేసే ప్రశ్న,"నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?"
కానీ తెలివైన ప్రశ్న -
"నేను ఎంత కాలం పెట్టుబడి పెట్టాలి?"
మీ పెట్టుబడి సమయం అంటే, మీకు డబ్బు అవసరం కావడానికి ముందు మీరు ఎంతకాలం పాటు పెట్టుబడి పెట్టగలరు అనే ఈ ఒక్క ముఖ్యమైన అంశం వీటిని నిర్ణయిస్తుంది:
- మీరు ఎంత రిస్క్ తీసుకోవచ్చు,
- మీరు ఏ ప్రోడక్టులు ఎంచుకోవాలి,
- మరియు మీ సంపద కాలక్రమేణా ఎలా పెరుగుతుంది.
మీ సమయ పరిధిని పరిగణించకుండా పెట్టుబడి పెట్టడం అనేది గమ్యస్థానాన్ని తెలుసుకోకుండా ఒక ట్రిప్‌ను ప్లాన్ చేయడం లాంటిది.
పెట్టుబడి సమయం అంటే ఏమిటి?
మీకు డబ్బు అవసరం కావడానికి ముందు మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టగలరనేది మీ పెట్టుబడి సమయం.
వివిధ లక్ష్యాలు వేర్వేరు సమయ పరిధులను కలిగి ఉంటాయి:
- స్వల్పకాలిక (0 - 3 సంవత్సరాలు): సెలవులు, అత్యవసర ఫండ్ లేదా చిన్న కొనుగోళ్లు
- మీడియం-టర్మ్ (3 - 7 సంవత్సరాలు): ఇంటి కొనుగోలు కోసం కారు కొనుగోలు, డౌన్-పేమెంట్
- దీర్ఘకాలిక (7+ సంవత్సరాలు): పదవీ విరమణ, పిల్లల విద్య, సంపద సృష్టి
ప్రతి పెట్టుబడి సమయం కోసం విభిన్నమైన పెట్టుబడి వ్యూహం ఉంటుంది.
పెట్టుబడి సమయం ఎందుకు చాలా ముఖ్యమైనది
-
మీరు ఎంత రిస్క్ తీసుకోవచ్చో ఇది నిర్ణయిస్తుంది
-
తక్కువ సమయం = తక్కువ రిస్క్
తక్కువ సమయం పెట్టుబడులు మరింత స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. -
ఎక్కువ సమయం = గరిష్ట రిస్క్ అనుమతించబడుతుంది.
దీర్ఘకాలిక పెట్టుబడిలో స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు తక్కువ ప్రాముఖ్యత ఉన్న కారణంగా వృద్ధి ఆధారిత ఎంపికలకు వీలు కలిపిస్తుంది.
-
తక్కువ సమయం = తక్కువ రిస్క్
-
ఇది మీ అసెట్ కేటాయింపునకు ఒక రూపాన్ని ఇస్తుంది
మీ పెట్టుబడి సమయం మీ పోర్ట్‌ఫోలియోలో స్థిరత్వం మరియు వృద్ధి మధ్య బ్యాలెన్స్‌ను ప్రభావితం చేస్తుంది.
లక్ష్యం ఎంత దూరంలో ఉంటే, తక్షణ స్థిరత్వానికి బదులుగా గరిష్ట దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యంగా పలు అంశాలను చేర్చుకునే అవకాశం పెరుగుతుంది. -
ఇది కాంపౌండింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది
కాంపౌండింగ్‌కు అవసరం అయ్యేది సమయం — టైమింగ్ కాదు.
దీర్ఘకాలిక అవధి వలన సహనంకి ప్రతిఫలం లభిస్తుంది. స్వల్ప కాలం పాటు పెట్టుబడి చేసే పెద్ద మొత్తం కంటే అనేక సంవత్సరాలు పాటు చిన్న మొత్తంలో క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులకు ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. -
ఇది మార్కెట్ అస్థిరత యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది
మార్కెట్లు స్వల్పకాలంలో హెచ్చుతగ్గులకు లోనవుతాయి, కానీ దీర్ఘకాలిక ట్రెండ్‌లు స్థిరమైన పెరుగుదలను సూచిస్తాయి, ఇది దీర్ఘకాల పెట్టుబడిదారులు తమ లక్ష్యం దిశగా సాగడానికి సహాయపడుతుంది.
-
ఇది మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి మరియు ఆందోళనను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది
మీ లక్ష్యం 10-15 సంవత్సరాల దూరంలో ఉందని మీకు తెలిసినప్పుడు, మీరు ఈ విధంగా చేసే అవకాశం తక్కువ:
- మార్కెట్ దిద్దుబాటు సమయంలో పెట్టుబడులను ఆపివేయడం,
- మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో అమ్మేయడం,
- స్వల్పకాలిక ట్రెండ్లను అనుసరించడం.
స్పష్టత క్రమశిక్షణను సృష్టిస్తుంది.
ఒక సరళమైన ఉదాహరణ
రెండు పెట్టుబడిదారులు, అదే మొత్తం, అదే రాబడులు (సంవత్సరానికి 12%), - వివిధ హారిజాన్లు:
| ఇన్వెస్టర్ | పెట్టుబడి సమయం | పెట్టుబడి | తుది విలువ (సుమారుగా)* |
|---|---|---|---|
| రాహుల్ | 5 సంవత్సరాలు | ₹ 10,00,000 | ₹17.62 లక్షలు |
| ఆశా` | 15 సంవత్సరాలు | ₹ 10,00,000 | ₹54.74 లక్షలు |
ప్రయత్నం ఒకటే.
ఫలితాలు విభిన్నం.
ఇదే సమయం చూపించే ప్రభావం.
క్యాలిక్యులేటర్: https://www.mutualfundssahihai.com/en/calculators/lumpsum-investment-calculator/
మీ ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడి సమయాన్ని ఎలా ఉపయోగించాలి
- మీ లక్ష్యాలను జాబితా చేయండి మరియు వాటిని స్వల్ప, మధ్య లేదా దీర్ఘకాలికంగా వర్గీకరించండి.
- పెట్టుబడి సమయాన్ని మార్గనిర్దేశకంగా ఉపయోగించండి:
- స్వల్పకాలిక అవధి: మూలధనాన్ని రక్షిస్తుంది.
- మధ్య-కాలిక అవధి: అప్రమత్తత మరియు వృద్ధి మధ్య సమతుల్యం.
- దీర్ఘకాలిక అవధి: దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యత.
- వీలైనంత త్వరగా పెట్టుబడి చేయడం ప్రారంభించండి, అది చిన్న మొత్తం అయినా, ఎందుకంటే సమయం డబ్బును వృద్ధి చేస్తుంది.
- మీ ఆదాయం పెరిగే కొద్దీ కాలక్రమేణా పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోండి.
- మీ పోర్ట్‌ఫోలియోను వార్షికంగా సమీక్షించండి మరియు లక్ష్యాలు సమీపిస్తున్న కొద్దీ దానిని సర్దుబాటు చేయండి.
- స్పష్టత లేకపోతే, సంప్రదించండి ఒక సెబీ-రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్:
సెబీ | గుర్తింపు పొందిన మధ్యవర్తులు
చివరి మాట: సమయం అనేది మీకు అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి భాగస్వామి
ఒక "ఆత్మనిర్భర్ ఇన్వెస్టర్"గా ఉండండి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంచుకోవడానికి ముందు, మీరు ఎంతకాలం పెట్టుబడిని కొనసాగించగలరో మొదట నిర్ణయించుకోండి.
పెట్టుబడి అంటే మార్కెట్ కదలికలను అనుసరించి డబ్బు పెట్టడం కాదు -
మార్కెట్‌లో పెట్టుబడిని కొనసాగించే సమయం మార్పునకు కారణం అవుతుంది.
